భూపాలపల్లి జిల్లా పోలీస్ ఓఎస్డీ గా బోనాల కిషన్
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:భూపాలపల్లి జిల్లా ఓ ఎస్డీ (అదనపు ఎస్పీ ఆపరేషన్) గా బోనాల కిషన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాల యంలో అదనపు ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐ పీ ఎస్ ని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. బోనాల కిషన్ 1995 లో ఎస్ ఐ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. పరకా లలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసి శాయంపేట పోలిసు స్టేషన్ లో మొదటి పోస్టింగ్, తర్వాత భూపాలపల్లి, పరకాల, హాసన్ పర్తి వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పని చేసా డు.2006లో సీఐగా యాగ్జిలరీ పదోన్నతి పొంది, చిట్యాల, ములుగు, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హన్మకొండలో విధులు నిర్వర్తించారు. 2019 లో డీఎస్పిగా పదోన్నతి పొంది, కాటారం, వరంగల్ నిజామాబాద్ లలో పనిచేస్తూ ఆగస్టు 2024లో పదోన్నతి పొంది భూపాలపల్లి ఓ ఎస్ డీ (అదనపు ఎస్పి ఆపరేషన్) గా బదిలీపై జిల్లాకు వచ్చారు. ఓ ఎస్ డీ గా (అదనపు ఎస్పీ ఆపరేషన్) గా బాధ్యతలు స్వీకరించిన బోనాల కిషన్ కు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.