శ్రీముత్యాలమ్మ గుడుల వద్ద మొక్కుబడుల సందడి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఆదివారం ఊరి పొలిమేరల లో ఉన్న గ్రామ దేవతల వద్ద మొక్కుబడులు సందడిగా కొనసాగుతున్నాయి. శ్రీముత్యాలమ్మ గుడి వద్ద భక్తులు, సన్నాయి మేళాలు, డప్పు సప్పుడులతో, మేకపోతు లు, కోడిపుంజులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.