సూరవీడు పంచాయతీలోని మూడు ఇసుక రీచ్ లలో ఉపాధి కల్పించాలి. 

Written by telangana jyothi

Published on:

సూరవీడు పంచాయతీలోని మూడు ఇసుక రీచ్ లలో ఉపాధి కల్పించాలి. 

– జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, తాసిల్దార్లకు సూరవీడు గ్రామస్తుల వినతి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం సూరవీడు పంచా యతీలోని సురవీడు, సూలవీడు కాలని, రామాంజపురం లోని మూడు గోదావరి ఇసుక సొసైటీ రాంపులలో స్థానికుల కు ఉపాధి కల్పించాలని సూరవీడు పంచాయతీ గ్రామస్తులు ములుగు జిల్లా కలెక్టర్, భద్రాచలం ఎమ్మెల్యే, వెంకటాపురం మండల తాసిల్దార్ లకు వినతి పత్రాలు అందజేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం… మూడు గోదావరి ఇసుక ర్యాంపులలో ట్రాక్టర్లకు బదులుగా టిప్పర్లు, లారీలు జేసిబి ల ద్వారా ఇసుక ను డంపింగ్ చేసి, తమకు ఉపాధి లేకుండా చేశారని, కూలీలకు బదులు యంత్రాలు వాడి  ఇసుక కాంట్రాక్టర్లు తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లారీలపై ఇసుకను చదును, టార్బలిన్ కట్టే పనులు కూడా తమకు రానివ్వడం లేదని వినతి పత్రంలో తెలిపారు. తమ పట్టా భూములలో గోదావరి ఇసుక మేట లు వేసిన కారణంగా ఉపాధి కోల్పోయామని,కూలి, నాలి చేసుకొని జీవించే ఎస్సీ, ఎస్టీ, బీసీ ల మయిన తమకు, తమ పంచాయతీలో నిర్వహిస్తున్న మూడు ఇసుక సొసైటీలలో ఉపాధి కల్పించాలని విన్నవించారు. అలాగే బుధవారం సూర వీడు గ్రామస్తులు తాసిల్దారుకు వినతి పత్రం అందజేసి, పేదలమైన తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల న్నారు.  ఈ మేరకు ఇసుక ర్యాంపులను పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now