గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో  పేద విద్యార్థులకు  పుస్తకాలు,  బ్యాగ్స్ పంపిణీ

Written by telangana jyothi

Published on:

గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో  పేద విద్యార్థులకు  పుస్తకాలు,  బ్యాగ్స్ పంపిణీ

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకులబోరు, రామచంద్రా పురం, మోర్రవానిగుడెం, ఆలుబాక, బర్రెబొంద , ఎదిర గ్రామా లలోని జి.యస్.యస్ డే కేర్ సెంటర్లో గ్రేస్ సర్వీస్ సొసైటీ  ఆధ్వర్యంలో నిరు పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. మొర్రవాని గూడెం పాఠశాల ఉపాధ్యాయురాలు పండా రాజమ్మ చేతుల మీదుగా డేకేర్ సెంటర్ లో బుధవారం 500 మంది నిరు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్,పెన్నులు,గిఫ్టుప్యాకెట్లను పంపిణీ చేశారు.అనంతరం రాజమ్మ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని కోరారు. గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనం దంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ కేర్ సెంటర్ ఇంఛార్జిలు మొర్రo రాజేష్, పున్నం ఆంజనేయులు, కనితి ముత్తయ్య, జయరాజు, సాధన, సంతోష్, శంకర్ రావు, స్వప్న సంస్ధ ప్రతినిధులు మురళీ కృష్ణరెడ్డి, సతీష్ డే కేర్ సెంటర్ సిబ్బంది, గ్రామస్తులు పలువురు పాల్గున్నారు.

Leave a comment