వాజేడులో వాడబలిజ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం
– వాజేడు మండల సంఘం అధ్యక్షులుగా గార నాగార్జున రావు ఎన్నిక.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు మండ లం మంగళవారం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాజేడు మండలం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన వాజేడు ఎస్సై హరీష్ మరియు, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ లను మర్యాద పూర్వ కంగా కలుసు కొని శాలువలతో సత్కరిం చి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగూరి రమణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు అల్లి సూరి బాబు, బుల్లె సూర్యం, వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున్, ఉపాధ్యక్షులు సుగంధపు సాంబశివరావు, ములు గు జిల్లా ఉపాధ్యక్షులు గార తిరుపతి, యూత్ ప్రెసిడెంట్ విజయ్ బాబు, మండల కోశాధికారి పానెం సురేష్, రాంబాబు, నరసింహారావు, సందీప్, సాంబం, యాట్ల బాబు, అబ్బాయి, సమ్మయ్య, మల్లయ్య, తిరుపతి, అశోక్, రఘు బాబు, నరసిం హులు, ఆదినారాయణ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.