మంత్రి సీతక్కకు ఎడ్ల బండిని బహుకరించిన నాసిరెడ్డి సాంబశివరెడ్డి

Written by telangana jyothi

Published on:

మంత్రి సీతక్కకు ఎడ్ల బండిని బహుకరించిన నాసిరెడ్డి సాంబశివరెడ్డి

– సీతక్క జన్మదినం సందర్భంగా అరుదైన కానుక

– రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ

తెలంగాణ జ్యోతి మంగపేట : రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి ఎద్దుల బండిని బహుకరించి సీతక్క పై తన అభిమానాన్ని చాటుకున్నారు.  మంగళవారం ములుగు పట్టణంలో జరిగిన సీతక్క జన్మదిన వేడుకలకు హాజరైన సాంబశివరెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన ఎద్దుల బండిని బహుకరించి మంత్రి సీతక్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్ల బండిని చూసిన సీతక్క ఆసక్తిగా తిలకించి హర్షం వ్యక్తం చేశారు. కనుమరుగైపోతున్న వ్యవసాయ సాధనం ఎడ్ల బండిని తనకు బహుకరించినందుకు సాంబశివరెడ్డిని అభినందిం చారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని అందుకే కనుమరు గవుతున్న వ్యవసాయ వాహనం ఎడ్ల బండిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలకొల్లు నుండి ఎద్దులను మహారాష్ట్ర నుండి తెప్పించి ఎడ్ల బండిని రూపొందించి మంత్రి సీతక్కకి బహుకరించినట్లు తెలిపారు. అదేవిధంగా వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీతక్క జన్మదినం సందర్భంగా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో రూ.25 వేల విలువైన ఎరువులను రైతులకి ఉచితంగా పంపిణీ చేసినట్లు సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మంగపేట కాంగ్రెస్ అధ్యక్షుడు మైళా జయరాం రెడ్డి, వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు పచ్చిపులుసు నరేష్, తిరుపతిరావు, ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పొనుగోటి చందర్రావు, కట్టం సాయి, పసుపులేటి కార్తీక్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now