వెంకటాపురం మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
– భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు.
– ములుగు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : భద్రాచలం నియోజకవర్గం లోని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ కు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు వినతిపత్రం సమర్పించారు. బుధవారం వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ములుగు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్ ను ఎంఎల్ఎ డాక్టర్ వెంటరావు తో కలసి సుదీర్ఘంగా సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా మూడు పేజీల వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. వెంకటాపురం మండలంలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే పాలెం వాగు ప్రాజెక్టు పంట కాలువలకు పూడికలు తీయించాలని, ప్రాజెక్టుకు మరమ్మతులు నిర్వహించాలని, ఆరుగుంట పల్లె వద్ద పాలెం ప్రాజెక్టు కాలువకు డైవర్షన్ రోడ్డును తొలగిం చాలని కోరారు. వెంకటాపురం వైద్యశాలకు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని కోరారు. వారసత్వ పట్టాలు ధరణి పోర్టల్ లో సమస్యలను పరిష్కరించి, నిబంధనల ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. డిఎంఎఫ్టి గ్రాంట్ కింద ఇసుక రీచ్ ల ద్వారా వచ్చే ఆదాయాన్ని వెంకటాపురం మంజూరైన ఇసుక క్వారీల ద్వారా వచ్చే ఆదాయంలో మండలానికి ప్రభుత్వపరంగా వాటా నిధులు మంజూరు చేయాలని కోరారు. వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారి మరమ్మతులు ప్రారంభించి రెండు సంవత్సరాలైనా నేటికీ పూర్తి కాలేదని దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, రహదారి పరమత్తులు పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. గోదావరి వరదల సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని ,వరదల సమయంలో కూడా విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని, వైద్య సహాయం అందించా లని, మర పడవలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టికల్ 274 బై ఐఏపి గ్రాంట్ కింద గోదావరి ఇసుక క్వారీల ద్వారా వచ్చే ఆదాయంలో వాటా నిధులు మండలానికి కేటాయించా లని కోరారు. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో మరియు పీహెచ్సీలలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని, పల్లెదవా ఖానాలకు, మరియు ఆరోగ్య ఉప కేంద్రాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని మారుమూల అటవీ ప్రాంతాలైన ముత్తారం, కలిపాక, ఇంకా అనేక గ్రామాల్లో ఉన్న అంగన్వాడి భవనాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట రావు సమక్షంలో వెంకటాపురం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల విన్నవించగా, జిల్లా కలెక్టర్ దివాకర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సమస్యలపై ఆయా శాఖల అధికారుల నుండి సమగ్ర నివేదిక తెప్పించి నిధులు లభ్యతను బట్టి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తామని,మారు మూల ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, జిల్లా కలెక్టర్ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు మరియు వెంకటాపురం కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు,వెంకటాపురం సొసైటీ చైర్మన్ చిడెం మోహన్రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, వెంకటాపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం శివ, కాంగ్రెస్ నాయకులు రమేష్, మురళి, ఎంపీటీసీ రవి తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.