వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 352 సీట్లు మంజూరు. 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 352 సీట్లు మంజూరు. 

– నూతన జూనియర్ కళాశాల కు అన్ని వర్గాల ప్రజలు,పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధులు, దాతలు సహకరించాలి.

– ఇంటర్మీడియట్ ములుగు జిల్లా నోడల్ అధికారి పుల్లఖండం వెంకటేశ్వరరావు. 

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలానికి నూతన జూనియర్ కళాశాల మంజూరు కాగా ఇంటర్మీడియట్ అన్ని కోర్సుల్లో 352 సీట్లను విద్యార్థులకు మంజూరు చేసిందని ములుగు జి ల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి పుల్లఖండం వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్తానిక ఉన్నత పాఠశాలలో కేటాయిం చిన భవనంలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, అడ్మిషన్ పొందిన విద్యార్థులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం 2022 సంవత్సరం అప్పటి శాసనమండలి సభ్యులు నూతన జూనియర్ కళాశాల మంజూరుకు ప్రతిపాదించారని, 2023లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలతో, భద్రాచలం శాసనసభ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు ప్రత్యేక శ్రద్ద వలన జూనియర్ కళాశాల వెంకటాపురం మండలానికి మంజూరు అయిందని జిల్లా అదికారి వెంకటేశ్వరావు తెలిపారు. ఈ మేరకు నూతన కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఈసి తదితర కోర్సులు ఉన్నాయని, తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో బోధన జరుగుతుందని తెలిపారు. నూతన కళాశాలకు ప్రభుత్వపరంగా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పనలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని, ఈ లోగా,తక్షణం కళాశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డులు తక్షణ అవసరాల నిమిత్తం దాతలు ముందుకు వచ్చి మన కళాశాల, మన ఊరు, మన విద్యార్థులు మనం. మన ప్రభుత్వ కళాశాల అనే భావనతో అందరూ సమిష్టిగా ముందుకు వచ్చి కళాశాలకు సహకరించాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో వాజేడు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వెంకటాపురం జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న కే .విజయ్ కుమార్ తో పాటు, అకాడమిక్ ఇన్చార్జి అధికారి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్,వి.వి. సత్యనారాయణ తదితరులు వేదికపై ఆసీనులు అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 40 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్ పొందారని, మరో కొద్ది రోజులకి 100 అడ్మిషన్ దాటిపోతాయని హర్షధ్వణాలమధ్య ప్రకటించారు. మండలం లోని వివిధ ఉన్నత పాఠశాలలో మరియు, గ్రామాలలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ చదువు ఉచిత నాణ్యత చదువు .అనే నినాదాలతో గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను, పూర్వ విద్యార్థులతో పాటు గ్రామస్తులు అన్ని వర్గాల ప్రజలు అడ్మిషన్ల సంఖ్య పెరిగేందుకు కృషి చేస్తున్నట్టు కళాశాల తరఫున అభినంద నలు తెలిపారు. ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలపై వెంకటాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భవనాన్ని తాత్కాలికంగా కేటాయించారని, ఈ మేరకు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు తరఫున, బెంచీలు కుర్చీలు నల్లబల్లలు ఇతర సదుపాయాలు కల్పించడం పట్ల నోడల్ ఆఫీసర్ పుల్లఖండం వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రిన్సిపల్ విజయకుమార్,అకడమిక్ అదికారి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు లు అభినందనలు తెలిపారు. కళాశాలకు 352 సీట్లు మంజూరు చేశారని, అలాగే 4 వేల పుస్తకాలు మంజూరు చేశారని నోడల్ అధికారి వెంకటేశ్వరరావు సభ ముఖంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొలి అడ్మిషన్ పొందిన విద్యార్థిని ముక్కెర గౌతమి ని అభినందించారు. అలాగే కళాశాల కు తాత్కాలికంగా కేటాయించిన మన ఊరు మనబడి పథకం కింద నిర్మించిన భవనం కు బిల్లులు రాకపోవడంతో కాంట్రా క్టర్లు భవనం లోపటికి వెళ్లకుండా ముళ్ళ కంపలు , మండల ను వేశారని వాటిని తొలగించి, నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు , కళాశాల యాజమా న్యం కు సహకరించాలనిఈ సందర్భంగా ఆయా భవన నిర్మా ణ కాంట్రాక్టర్లను సభాముఖంగా వారిని పిలిపించి మాట్లాడి, ముళ్ళకంపలు తొలగించాలని నోడల్ అధికారి వెంకటేశ్వర రావు ,కళాశాల ప్రిన్సిపల్ విజయచందర్, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు కోరారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now