ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థుల ఔదార్యం

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థుల ఔదార్యం

– కళాశాలకు కుర్చీలు సీలింగ్ ఫ్యాన్లు, కూల్ వాటర్ క్యాన్లు పంపిణీ. 

– అభినందించిన గ్రామస్తులు. 

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలానికి, 40 సంవత్సరాల అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కావడం పట్ల మండల ప్రజల హర్షం వ్యక్తం చేశారు. అయితే నూతన కళాశాలకు మౌలిక సదుపాయాలు కల్పనకు 1992 – 93 సం. పదవ తరగతి పూర్వ విద్యార్థులంతా సమావేశమై మన ఊరు మన జూనియర్ కళాశాల, మన విద్యార్థులు అనే ఆదర్శనీయమైన భావనతో, ఇంటర్ విద్యార్థులు సౌకర్యం కోసం సుమారు 20 వేల రూపాయలు విలువైన కుర్చీలు, రెండు సీలింగ్ ఫ్యాన్ లు ,కూల్ వాటర్ క్యాన్లు , పంపిణీ చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల విధ్యార్ధు లకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ములుగు జిల్లా ఇంటర్ మీడియట్ నోడల్ అధికారి పుల్లఖండం వెంకటేశ్వరరావు ,ఇన్చార్జి ప్రిన్సిపల్ కే. విజయ చందర్, అకాడమిక్ అధికారి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు విద్యార్థులు ,గ్రామస్తులు సమక్షంలో కుర్చీలు పది, రెండు సీలింగ్ ఫ్యాన్లు, కూల్ వాటర్ క్యాన్ లు బ్లాక్ బోర్డులు సైతం అందజేసారు. పూర్వ విద్యా ర్థుల ఔదార్యం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని దాత లు ముందుకు వచ్చి నూతన కళాశాలకు సహకరించాలని హర్షద్వానాల మధ్య ప్రకటిం చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1992-1993 సంవత్స రం బ్యాచ్ కి చెందిన పూర్వ విధ్యార్ధులు అజ్గరి బేగం 10వెల రూపాయలు, తిరుపతి మధువరణ్ 2,000, కే. ప్రసాద్, బి. సునీల్, దంతనపల్లి ఆదినారాయణ, దూడ ప్రసాద్ రెడ్డి, మడుగూరి సుమతి, మడుగూరి సరిత, ఉమా శంకర్ రాణి తదితరులు ఒక్కో క్కరు వెయ్యి రూపాయలు వంతున, పూర్వ విద్యార్థులుగా మన ఊరు, మన కళాశాల అనే భావనతో, విరాళాలు పోగు చేసి, కుర్చీలు సీలింగ్ ఫ్యాన్లు ,కూల్ వాటర్ క్యాన్లు, బ్లాక్ బోర్డులు కొనుగోలు చేసి మెటీరియలను ,బుధవారం జరిగిన సమావేశంలో అందజేసీ , గ్రామస్తుల అభిమానాన్ని పొందా రు. ప్రతి ఒక్కరు నూతన జూనియర్ కళాశాల కు మౌళిక సదుపాయాలు కల్పనలో దాతలు ముందుకు వచ్చి సహక రించాలని, ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now