ఉపాధి హామీలో అక్రమాలు..?
తెలంగాణ జ్యోతి,కన్నాయిగూడెం : ఉపాధిహామీ పనులపై మరో సంచలనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యకికి పని చేయ కుండా ప్రతి ఏటా వేతనాలు వారి అకౌంట్ జమ అవుతున్నా యని విమర్శలు ఉన్నాయి.ఏటేటా నిధులు దుర్వినియోగం అవుతున్న అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్టుగా వ్యవహరించడంలో అంతర్యం ఏమిటో…
గతంలో ప్రజా వేదిక సమావేశంలో విచారణ జరగగా అధికారుల సమిక్షంలో అవకతవకలు జరిగినట్లు రుజువైంది. ఈ క్రమంలో సంబంధిత అధికారులు 70 రూపాయల రికవరీ చేయాలని ఆదేశించారు.అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఉపాధిహామీ పనుల్లో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో ముమ్మాటికీ అధికారులు నిర్లక్ష్యంమని చెప్పవచ్చు.
అక్రమాలకు ఉపాధిహామీ
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఎంతో ఊరట కలిగిస్తున్న ఉపాధిహామీ పథకంలో అక్రమాలు ఆగటంలేదు.అన్ని స్థాయి ల్లోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నా ఉన్నత అధికారులు తగిన చర్యలు చెప్పట్టటం లేదు.గ్రామస్థాయిలో చేపడుతున్న పన్నులో అనేక అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి.