వెంకటాపురం బస్టాండ్ లో మానవత్వం చాటుకున్న ప్రయాణికులు.
మద్యం మత్తులో తండ్రి : ఆకలితో అలమటించిన చిన్నారి.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఆర్టీసీ బస్టాండ్ లో తోటి ప్రయాణికులు పసి బిడ్డ కు సపర్యలు చేసి, పళ్ళు మంచినీళ్లు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. తండ్రి పీకల దాకా మద్యం సేవించి, బస్టాండ్ ప్లాట్ఫారంపై మద్యం మత్తులో గాఢ నిద్రలోకి జారుకున్నాడు.సుమారు ఏడాదిన్నర వయసుకు పైగా ఉన్న అతని కుమారుడు, తండ్రి వద్ద కూర్చుని ఆకలి, దాహంతో మాటలు రాని ఆ చిన్నారి అలమటిస్తున్నాడు.బస్ ల కోసం వేచి వున్న తోటి ప్రయాణికులు, బాలుడి దీన స్తితి ని చూసి వెంటనే స్పందించి, బాలుడికి అరటిపండ్లు తినిపించి, వాటర్ బాటిల్ ద్వారా దప్పిక తీర్చారు. సదరు తండ్రి మద్యం ప్రియుడు పీకల దాక త్రాగి కొడుకును పట్టించుకోకుండా, నిద్ర మత్తుకు జారుకున్నడు.. అతన్ని పైకి లేపి ఏ ఊరు అ ని ప్రయాణీకులు అడగగా చర్ల మండలం అని, భార్యతో గొడవపడి కొడుకుని తీసుకొని,వెంకటాపురం వచ్చేసానని, ఏటూ రు నాగారం వెళ్తున్నానని మత్తులో తూగుతూ తెలిపాఢు. మద్యం ప్రియుడికి నీళ్లు తాగమనీ, పలువురు ప్రయాణికులు, ముఖ్యంగా మహిళ ప్రయాణికులు శాపనార్ధాలు పెడుతూ, కన్న కొడుకుని అలా వదిలేసి తాగి పడుకుంటే బాలుడి పరిస్థితి ఏంటని ఎవరు చూస్తారు. అంటూ ఇదే నా తండ్రి బాధ్యత అంటూ శాపనార్థాలు పెట్టారు. పేరు కూడ చెప్పలేని తాగు బోతు తండ్రి కి శాపనార్థాలు పెడుతూ,ప్రయాణీకులు దుమ్మెత్తి పోశారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నూగూరు వెంకటాపురం బస్ స్టేషన్ లో జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,వెంకటాపురం స్టేషన్ కంట్రోలర్ తాగుబోతు తండ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి, పసి బాలుడికి, పళ్ళు , నీళ్ళు అందించి ప్రయాణికులు మానవత్వం చాటుకున్నారు. కాగా మత్తులో ఉన్న తండ్రి మాత్రం బస్టాండ్ సమీపంలో ఏమైనా మద్యం దొరుకుతుందా అని అడగటం కోస మెరుపు. మంచినీళ్లు తాగమంటే వాటర్ వద్దు మందు కావాలని అడగటం విస్మయం కలిగించింది.
1 thought on “వెంకటాపురం బస్టాండ్ లో మానవత్వం చాటుకున్న ప్రయాణికులు. ”