నారాయణరెడ్డి మాటల్లో వాస్తవం లేదు
– సువిద్య స్కూల్ కరెస్పాండెంట్ కొట్టి శ్రీశైలం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మాజీ జెడ్పిటిసి చల్ల నారాయణరెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం లేదని మతి భ్రమించి తాను ఏమి మాట్లాడాడొ తెలియక తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నడని సువిద్య స్కూల్ కరస్పాండెంట్ కొట్టే శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజుల క్రితం చల్ల నారాయణరెడ్డి ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ గతంలో పుట్ట మధుపై శ్రీధర్ బాబు శ్రీను బాబు హత్యకు కుట్ర చేశారని, దానికోసం సువిద్య స్కూల్ వ్యాన్ వాడుకున్నారని దానిలో 40 మందిని ఎక్కించానని అసత్యపు మాటలు మాట్లాడుతూ ఏదో పన్నాగం పన్ని కథ అల్లుతున్నాడని, దీంట్లో ఎలాంటి వాస్తవం లేదనీ ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడూ నారాయణ రెడ్డికి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని స్కూల్ వ్యాన్ ఇవ్వలేదని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవసరాలకు తన వ్యాను ఎన్నడూ వాడుకోలేదని ఆయన పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత కక్షలతో తనపై నిరాధారరమైన ఆరోపణ చేస్తున్నరన్నారు. గతంలో ఎన్నోమార్లు తనను శ్రీధర్ బాబుకు ఎందుకు పనిచేస్తున్నావని, బెదిరించిన సంఘటనలు ఉన్నా యని అతని మాటలను లెక్కచేయనందుకె వ్యక్తిగతంగా తన పై కావాలని తప్పుడుగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. నీ తప్పుడు ఆరోపణలకు భయ పడాల్సిన అవసరం లేదని ఆయన తన ప్రకటనలో పేర్కొ న్నారు.తన ప్రతిష్ట, తన స్కూల్ ప్రతిష్ట దిగజారే విధంగా మాట్లాడుతూ తనను ఇబ్బందిలకు గురి చేస్తూ తప్పుడు ఉద్దేశంతో మాట్లాడి తన ఉనికిని కాపాడుకుంటున్నాడని ఆయన అన్నారు. ఈ విషయంలో తన మాటలు వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే కోర్టులో పరువునష్టం దావ వేస్తానని ఆయన హెచ్చరించారు. అంతే గాక నిస్వార్ధంగా పనిచేసే శ్రీధర్ బాబు, శీను బాబు పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరని తగు విధమైన బుద్ధి చెప్తారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.