తాడ్వాయి పస్ర రహదారి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి, పస్ర రహదారి మధ్య జలగలంచ వాగు సమీపంలో బస్సు లారీ ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి జరిగింది. సంఘటన స్థలానికి తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి చేరుకుని బస్సులో గాయాల పాలైన ప్రయాణికులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. లారీ బస్సు ఎదురెదురు గా ఢీకొట్టు కోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నే పద్యంలో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తాడ్వాయి మేడారం పస్ర మీదుగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ప్రమాద స్థలం నుంచి వాహనాలను తొలగించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.