ఐలాపూర్‌లో వెంటనే వివోఏను నియమించాలి

On: May 18, 2026 3:01 PM

ఐలాపూర్‌లో వెంటనే వివోఏను నియమించాలి

మహిళా సంఘాల కార్యకలాపాలు నిలిచిపోవడంతో పెసా కమిటీ డిమాండ్

కన్నాయిగూడెం, మే 17, తెలంగాణ జ్యోతి: ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు సక్రమంగా కొనసాగేందుకు వెంటనే వివోఏను నియమించాలని పెసా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆలం నాగేష్ డిమాండ్ చేశారు. గతంలో విధులు నిర్వహించిన వివోఏ సర్పంచ్‌గా ఎన్నికై రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలలు గడిచినా కొత్త నియామకం చేపట్టకపోవడంతో మహిళా సంఘాల కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామసభ ద్వారా పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసి మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!