రాష్ట్ర మంత్రులను కలిసిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు.
వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉత్తంకు మార్ రెడ్డి,దనసరి సీతక్క లను ములుగు జిల్లా వెంకటాపురం వాజే డు మండలాల కాంగ్రెస్ నేతలు శుక్రవారం హైదరాబాదులో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.మారుమూల గిరిజన ప్రాంతాలైన వెంకటా పురం, వాజేడు మండలాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మంజూ రు చేయాలని, గిరిజన ప్రాంతం కావడంతో అన్ని రకా ల సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకు లు నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ విజ్ఞప్తి చేశారు. మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వెంకటాపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు సయ్యద్ హుస్సేన్, వాజేడు నాయకులు వాజేడు సొసైటీ అధ్యక్షులు ఎ. అంజయ్య ఎంపిటిసి రవి, ఉపాధ్యా యులు పీర్ల కృష్ణబాబు, రెండు మండలాల కాంగ్రెస్ నాయకులు తదితరులు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
1 thought on “రాష్ట్ర మంత్రులను కలిసిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు. ”