సహజ వనరుల దోపిడిని అరికట్టడానికి బిజెపికి ఓటేయండి
– కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి
– ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆశీర్వదించండి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ఈ ప్రాంత సహజ వనరులైన నీళ్లు, ఇసుక దోపిడికి గురవుతుంటే ఇక్కడి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల సమావేశాన్ని నిర్వహించగా గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టిన తాను గత 35 సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉన్నానని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలచే ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారాన్ని అనుభవిస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని మరిచిపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్న కుటుంబ పాలనకు స్వస్తి పలికి ఈ ప్రాంత బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. భారతదేశాన్ని అభివృద్ధి పరుస్తున్న ప్రధానమంత్రి మోడీని బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ప్రాంతంలో అనేకమార్లు గెలిచిన వెంకటస్వామి, వెంకటస్వామి వారసులు అభివృద్ధి చేయలేదని ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తూ పదవులను అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత యువత కోసం కంపెనీలను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే అభివృద్ధితోపాటు చదువుకున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి జిల్లా బీ జే పీ అధ్యక్షుడు, మంథని నియోజకవర్గ ఇంచార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి, కాటారం, మహదేవ పూర్ మహ ముత్తారం బిజెపి పార్టీ అధ్యక్షులు బండం మల్లారెడ్డి, శ్రీధర్, పూర్ణచందర్, దుర్గం తిరుపతి, గంట అంకయ్య, పాగె రంజిత్ తదితరులు పాల్గొన్నారు.