వెంకటాపురంలో విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం
– పెన్షనర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంక టాపురం, వాజేడు మండలంతో పాటు చర్ల తదితర మండ లాల నుండి పెద్ద సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు హాజరై తమ సమస్యలను సమావేశాల్లో పరస్పరం చర్చించుకున్నారు. సమా వేశానికి టీఎస్ జి.ఆర్.ఈ.ఏ జిల్లా సంఘం అధ్యక్షులు పి. సారయ్య, సంఘం ములుగు జిల్లా కార్యదర్శి బి. రామ్మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇటీవలనే పదవీ విరమణ పొందిన విశ్రాంతి ఉద్యోగులకు సమావేశంలో ఘనంగా సన్మానిం చారు. పెన్షనర్లకు ప్రభుత్వపరంగా ఇంటి స్థలాలు కేటాయిం చాలని, సమావేశంలో కోరారు.అలాగే బ్యాంకులు, ట్రెజరీ కార్యా లయంతో పాటు విశ్రాంతి ఉద్యోగుల లైవ్ సర్టిఫికెట్లు విషయాల్లో అధికారులందరూ, సహకరిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలి పారు. సమావేశంలో తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ డాక్టర్ సి.హెచ్. వేణు, ప్రభుత్వ ఉప కోశాధికారి ఎం. ప్రసాద్ వెంకటాపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటాపురం బ్రాంచ్ మేనేజర్ ఎన్.బుచ్చయ్య, ఇంకా పలువురు అధికారులు పాల్గొని పెన్షనర్ల సమస్యలపై తమ,తమ శాఖల పరంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విశ్రాంతి ఉద్యోగుల వెంకటాపురం మండల అధ్యక్షులు కాల్వ సుందర్రావు, సంఘం ప్రధాన కార్య దర్శి కెఎల్ఎన్ ఆచార్యులు, సంఘం యొక్క కార్యకలాపాలు ప్రగతి నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు. అనం తరం ఇటీవలనే రిటైర్ అయిన ఉద్యోగులు , షెన్షనర్లు సాదన పల్లి లాలయ్య, చిట్టి మళ్ళ ప్రసాద్, బడే నాగమణి, ఎట్టి శివా నమ్మ, పాయం సుజాత, పి. రాంబాయి తదితరులకు పట్టు శాలువాలతో సన్మానించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్య క్షులు కాల్వ సుందర్ రావును వారి సేవలను కొనియా డుతూ, ఇటు పెన్షనర్లకు, అటు బ్యాంకుల వద్ద ఖాతాదారులకు, విశేష ఉచిత సేవలు అందిస్తున్నందుకు, ఎస్బి.ఐ బ్యాంక్ మేనే జర్ ఎన్. బుచ్చయ్య పట్టు శాలవతో సమావేశంలో సన్మానించారు.