గంజాయి పై పోలీసుల కౌన్సిలింగ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : గంజాయి పై కాటారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి డిఎస్పి చాంబర్ లో డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి సేవించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఘాటుగా హెచ్చరిం చారు. గంజాయి కి సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు. వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని 100 నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు, కాటారం ఎస్సై మ్యాక అభినవ్ పాల్గొన్నారు.