సరస్వతి పుష్కరాలలో వాసవి క్లబ్స్ మహా అన్న ప్రసాదం
కాటారం, తెలంగాణ జ్యోతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం లో సరస్వతీ పుష్కరాలను పురస్కరించుకొని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్నదానం శిబిరాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. దగ్గరుండి వచ్చిన భక్తులకు స్వయంగా వడ్డన చేశారు. ఆర్యవైశ్యుల సమస్యలకు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేసిన అందుబాటులో ఉండి సహకరిస్తా నని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సరస్వతి పుష్కరాలలో ఇంత పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. గత రెండు రోజులలో ఈ కార్యక్రమంలో సుమారు పదివేల మంది పుష్కర భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. పుష్కరాలలో వీధుల్లో నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పుష్కర భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తూ నిర్వాహకులను అభినందిస్తున్నారు. పుష్కర భక్తుల కు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్న ప్రసాదం సాయంత్రం అల్పాహారం, అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కాకుండా రెండు ప్రదేశాలలో పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల కోసం ఉచితంగా మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు నిర్వా హకులు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుపుల రామకృష్ణ, కాలేశ్వరం సరస్వతి నది పుష్కరాల మహన్నదాన కమిటీ చైర్మన్ పవిత్రం శ్రీనివాస్, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ముక్త శ్రీనివాస్, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ రేణిగుంట శ్రీనివాస్, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్, వి107 గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్, బాల సంతోష్ కుమార్, పుల్లూరు బాల్మోహన్, భువనగిరి వేణుగోపాల్, రాచర్ల రాజేందర్, శ్రీ కాలేశ్వర ముక్తేశ్వరస్వామి దేవస్థానం డైరెక్టర్ గంధెసిరి సత్యనారాయణ పుష్కర భక్తులు పాల్గొన్నారు.