నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

-2 వేల లీటర్ల బెల్లం పానకం ధ్యంసం

– 5 గురిపై కేసులు నమోదు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఉదయం కార్టన్ అండ్ సర్చ్ తనిఖీలలో భాగంగా సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల దాడులను ముందే పసిగట్టిన దొంగ సారా వ్యాపారులు అడవుల్లోకి పరుగులు తీశారు. ఈ సందర్భంగా దాడుల్లో పాల్గొన్న వెంకటా పురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు మాట్లాడుతూ గుడుంబా, గంజాయి వంటి నిషేధిత తయారీ, విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. అలాగే అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు”

Leave a comment