మావోయిస్టు దంపతుల లొంగుబాటు
ములుగు, తెలంగాణ జ్యోతి : మావోయిస్టు దంపతులు నూప బీమా అలియాస్ సంజు మచ్చకి దుల్హో, అలియాస్ సోనీ లు ములుగు ఎస్పీ శబరీష్ సమక్షంలో గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యా లయం ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చర్ల మండలం బూర్గంపాడు గ్రామంలో కూలి పని చేసుకునే నుప బీమా అలియాస్ సంజు, భార్య ముచ్చకి దుల్దో అలియాస్ సోనీ లు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2018లో పార్టీ సభ్యులుగా చేరారని, మావోయిస్టు పార్టీ సిద్దాంతాలు నచ్చకపోవడం, పార్టీపై ప్రజల్లో ఆదరణ సన్నగిల్లడం, ఆనారోగ్య సమస్యలతో కీలక నాయకులు లొంగిపోతున్నారని అన్నారు. వీరు పలు మావోయిస్టు విధ్వంసక చర్యలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన బీమా, సోనీ దంపతులకు ప్రభుత్వం నుంచి రివార్డులు, పునరావాసం అందిస్తామన్నారు. మావోయిస్టు పార్టీలోని వారు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పునరావసం కల్పిస్తామని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డిఅశోక్ కుమార్, డిఎస్పి రవీందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.