పేరూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి సోయం వినీత్ మృతి
– హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని గిరిజన సంఘాలు, బంధువులు ఆందోళన
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గిరిజన బాలుర ఆశ్రమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న సోయం వినీత్ సకాలంలో వైద్య అందక వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆదివారం పేరూరు పాఠశాల ఎదుట విద్యార్థి బంధువులు, గిరిజన సంఘాలు, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిం చారు. వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి వినీత్ మృతి చెందాడని కారకులైన వార్డెన్ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షులు కొరస నరసింహమూర్తి, ఇంకా పలు గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న, వినీత్ బంధువులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై ములుగు జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వెంటనే విచారణ నిర్వహించి పట్టణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు నివాసం ఉంటూ అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి చుట్టపు చూపుగా వెళ్లి వస్తున్నారని, పాఠశాల హెచ్ఎం వార్డేన్ లపై కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
2 thoughts on “పేరూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి సోయం వినీత్ మృతి”