ఆదివాసీ మహిళా ఇసుక సొసైటీల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
– నూతన ఇసుక విధానం లో సొసైటీల అభిప్రాయం తీసుకోవాలి
– పెసా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోము
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండ లాల ఇసుక సొసైటిల సమావేశం సోమవారం మండల పరిధిలోని ముర్రవాని గూడెంలో ఆదివాసీ మహిళ నాయకురాలు ముర్రం రామలక్ష్మి ఆధ్వర్యంలో ఇసుక సొసైటీ ములుగు జిల్లా అధ్యక్షులుగా ముర్రం రామ లక్ష్మి, ఉపాధ్యక్షులుగా, కోరం సావిత్రిలు ఏక గ్రీవంగా ఎన్నిక య్యారు. నూతన అధ్యక్షురాలు ముర్రం రామ లక్ష్మి రెండు మండలాల సొసైటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వం తెస్తున్న నూతన ఇసుక పాలసీ విధానం పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆమె తెలిపారు. నూతన ఇసుక పాలసిలో ఆదివాసీ ఇసుక సొసైటీల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో ఏళ్లుగా దోపిడీకి గురి అవుతు న్నామని అన్నారు. కారు చౌకగా ఇసుకను తరలిస్తూ సొసైటీ లకు చిల్లర వేస్తున్నారని మండిపడ్డారు. 2013 లో నిర్ణయించిన రూ. 220లతో ఆదివాసీలకు అన్యాయం జరుగు తోందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా క్యూబిక్ మీటర్ కి వెయ్యి రూపాయలు నిర్ణయించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. పట్టా ల్యాండ్స్ రద్దు చేయాలని వీటి కారణంగా ఆదివాసీలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తెచ్చే క్లస్టర్ విధానం సొసైటీలకు నష్టం కలిగించే అవకాశం ఉందని అన్నారు. నూతన ఇసుక పాలసి లో సొసైటి ల ప్రాధాన్యత పెంచాలని పేర్కొన్నారు. పెసా చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రభుత్వ విధానం ఉంటే ఉపేక్షించ బోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెండు మండలా ల ఇసుక సొసైటిల సభ్యులు పాల్గొన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాలకుకి చెందిన ఆదివాసి ఇసుక సొసైటీ సభ్యులు, గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరై ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, ఒక్క తాటిపై నిలిచి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి న్యాయమైన గిరిజన హక్కులు సాధించుకుందామని హర్షద్వానాల మధ్య ప్రకటించారు.
2 thoughts on “ఆదివాసీ మహిళా ఇసుక సొసైటీల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక”