విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి.
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు, తెలంగాణ జ్యోతి : విద్యాకోసం ర్థులు ఉన్నత లక్ష్యాల ను ఏర్పర్చుకొని సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో టెన్త్, ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎస్పీ పి.శబరీష్, అదనపు కలెక్టర్ శ్రీజలతో కలిసి కలెక్టర్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణిస్తే సమాజంలో మంచి గౌరవం పొందుతారన్నారు. నేటి విద్యార్థులు రేపటి దేశాన్ని ముందుకు నడిపే మేథా సంపత్తి అని, చదువుల్లో ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి స్తానంలో నిలిపి నందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఇంటర్మీ డియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో రాష్ట్రంలో రెండవ ర్యాంక్ సాధించిన టిఎస్ ఆర్ జెసి విద్యార్థి పి.చరణ్ తేజ, రెండవ సంవత్సరం ఫలితాలలో జిల్లా మొదటి స్థానం లో నిలిచిన ఆకుల ఆకాశ్ , ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది విద్యార్థులు, టెన్త్ ఫలితాలలో జిల్లాలో 10/10 ఉత్తీర్ణత సాధించిన 11 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసాపత్రం, మెమోంటో ప్రదానం చేసి శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, డీఈఓ పాణిని, జిల్లా మైనారిటీ అధికారిని ప్రేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.