హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
– యాగం నిర్వహించిన మహేందర్ శర్మ, మాడుగుల బాపు శర్మ, పవన్ శర్మ
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వర గ్రామం లో హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపు శర్మ ఆధ్వ ర్యంలో కాళేశ్వరం హనుమాన్ మాలదారణ స్వాములు ఉదయం 4 గంటలకు నగర సంకీర్తన తో జెండాను గోదావరి స్నానం చేయించి రావి చెట్టుకు ధ్వజారోహణం చేశారు. అనంతరం హనుమంతునికి పంచామృతం, మన్యాసుక్త పూర్వక అభిషేకం, యాగం, పూర్ణాహుతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం మాల ధారణ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.