చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

Written by telangana jyothi

Published on:

చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

– రక్తదానం చేసిన 30 మంది యువకులు

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవం సందర్బంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో చేయూత ఫౌండేషన్ కార్యాలయం నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా యువకులు రక్తదానం చేశారు. భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ వారికి 30యూనిట్స్ రక్తం ఇచ్చారు. గర్భిణీ స్త్రీలు, రక్తహీనత కలిగిన పిల్లల కొరకు అత్యవసర సమయాల్లో రక్తం ఉపయోగపడుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. వెంకటాపురం డిప్యూటీ తాసిల్దార్ మహేందర్, ఏఈ సునీల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల కిషోర్, గోపి, గుండమల్ల మధు,చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సందీప్, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ ఆది, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment