ఎస్సీ వర్గీకరణకై సీఎం సానుకూల ప్రకటన
– మాదిగ జేఏసీ హర్షం.
– సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ములుగు జిల్లా మండల కేంద్రం వెంకటాపురంలోని రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహ ఆవరణలో మాదిగ జేఏసీ ములుగు జిల్లా కార్యదర్శి వెంకటాపురం మండలం ఇంచార్జి యాసం శ్రీను, జేఏసీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకై ప్రకటన జారీ చేయడం పట్ల మాదిగ జేఏసీ వర్గాల్లో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు అవుతున్నాయని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆదేశంపై పాలాభిషెకం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కొనియాడారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయ కులు కొడారి అభి, బొంతల సమ్మయ్య, యాసం చరణ్, యాసం గౌతం, చిట్యాల శేషు,జి. విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
2 thoughts on “ఎస్సీ వర్గీకరణకై సీఎం సానుకూల ప్రకటన”