మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ఆఫీసర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలి
– సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
– ఆస్పిరేషనల్ బ్లాక్ లోని కన్నాయిగూడెంను అభివృద్ధి చేస్తాం
– సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్,- సబ్ కా ప్రయాస్ నినాదంతో కేంద్రం పనిచేస్తుంది
– కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
– ములుగు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష, వెంకటాపూర్ మండలం నందిపాడు గ్రామ సందర్శన
– బీజేపీ కార్యకర్తలతో కలిసి భోజనం
ములుగు ప్రతినిధి : ప్రపంచ దేశాల్లో 2028 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ఆఫీసర్లు చిత్తశుద్ధితో కృషి చేస్తూ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సోమ వారం ములుగుకు వచ్చిన కేంద్ర మంత్రికి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్లు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించా రు. అనంతరం ములుగు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారు లతో సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధి, సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాలపై వివరిం చారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లాలోని వెనుకబడిన మండలం అయిన కన్నాయిగూడెంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన సంపూర్ణత అభియన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీతి అయో గ్ జిల్లాలో సూచించిన ఆరు ఇండికేటర్లను, మండలంలో సూచించిన ఇండికేటర్ ల పురోగతి, వాటి అమలులో ఎదుర వుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 112 జిల్లాలలో 500బ్లాక్ లలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతోందని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2018 ఏడాదిలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం 5వ స్థానానికి చేరిందని, దానిని 2028కల్లా మూడవ స్థానానికి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. 2018లో దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ప్రామాణికంగా తీసుకున్నామని, 2023లో దేశ వ్యాప్తంగా 500 ప్రత్యేక బ్లాక్ లను గుర్తించి ఆ ప్రాంతాలలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 బ్లాక్ లను ఎంచుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలాన్ని ఎంచుకున్నామని తెలిపారు. నీతి అయోగ్ ద్వారా ఎంపిక చేసుకున్న ఆరు ప్రామాణిక అంశాలను అమలు చేయడంలో లక్ష్యాన్ని ఏమేరకు చేరుకున్నారు, ఎలాంటి అవాంతరాలు తలెత్తుతున్నాయి, తదితర అంశాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు. సంపూర్ణత అభి యాన్ కార్యక్రమంపై పూర్తిస్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మళ్లీ త్వరలోనే సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపా రు. ములుగు ప్రాంతం మొదటి స్థానంలో నిలిచేలా అధికా రులు కృషి చేయాలని సూచించారు.
– నందిపహాడ్ గొత్తికోయ గూడెం సందర్శించిన కేంద్ర మంత్రి
ములుగులో సమీక్ష నిర్వహించిన అనంతరం వెంకటాపూర్ మండలంలోనీ లింగాపూర్ సమీపంలోగల నంది పహాడ్ గొత్తికోయ గూడెంలో ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయబడిన తాగునీటి బోర్‌వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్ లను కేంద్ర హోం వ్యవహారాల శాఖ పి.ఎస్.ఆంధ్ర వంశీతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అన్న ప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, విద్యా ర్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మీడి యా ప్రతినిధులతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థిక పురోగతులు సాధించా లని, క్షేత్రస్థాయిలో కేంద్ర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి అధిక మొత్తంలో నిధు లు కేటాయించామని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ల ఆలయ అభివృద్ధి కోసం కృషి జరుగుతోందన్నారు. ప్రసాద్ స్కీంలో చేర్చి పనులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. చిట్టచివర ఉన్న గ్రామాల్లోని ప్రజలు అభివృద్ధికి చేరువ కావా లని ఆకాంక్షించారు. లింగాపూర్ గ్రామంలో రైతులు, మహిళా స్వయం సంఘాలు, గర్భిణి స్త్రీలతో మాట్లాడిన కేంద్ర మంత్రి వారికి కేంద్రం, రాష్ట్రం నుంచి అందుతున్న పథకాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయ నృత్యా లతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారు లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.
– కార్యకర్తలతో కలిసి భోజనం
ములుగు పర్యటనకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ములుగు మండలం జంగాలపల్లి వద్ద ఉన్న బ్రాహ్మణ ఉన్నత పాఠశాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తల ను కలిసి ముచ్చటించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యకర్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, అజ్మీర కృష్ణవేణి నాయక్, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, గిరిజన మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాజునాయక్, భూక్య జవహర్లాల్, బీజేపీ జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, శీలమంతుల రవీంద్రాచారి, నగర పు రమేష్, రాయంచు నాగరాజు, ఆకుల నాగేశ్వర్ రావు, మండల లవన్ కుమార్, ఆడెపు భిక్షపతి, మందల వెంకట రమణా రెడ్డి, ములుగు, వెంకటాపూర్ మండల అధ్యక్షులు గాదం కుమార్, పైడాకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.