ములుగు మున్సిపాలిటీ బడ్జెట్‌కు ఆమోదం

On: March 16, 2026 5:54 PM

ములుగు మున్సిపాలిటీ బడ్జెట్‌కు ఆమోదం

ములుగు మున్సిపాలిటీ బడ్జెట్‌కు ఆమోదం

ములుగు, మార్చి16,తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గౌరవ చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ ఆదాయ–వ్యయాల అంచనాలను పరిశీలించిన కౌన్సిలర్లు బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపాలి టీకి స్వంత ఆదాయం రూ.352 లక్షలు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.1720 లక్షలు అందనున్నట్లు అంచనా వేయగా, మొత్తం రూ.2072 లక్షల బడ్జెట్‌ను నిర్ణయించారు. ఈ బడ్జెట్ ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు మరియు ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!