వరికోత యంత్రాల ధరలపై యజమానులతో సమావేశం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో వరి కోత యంత్రా ల ధరలపై యజమాలతో తాహసిల్దార్ లక్ష్మీరాజయ్య సమా వేశం నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 8 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుత కోత దశలో ఉండగా వరికోత యంత్రాల ధరలు తగ్గించి రైతులకు న్యాయం చేయాలని, ఆదివాసి నవనిర్మాణసేన వెంకటాపురం మండల కమిటీ సోమవారం తాసిల్దార్ కు వినతిపత్రం అంద జేశారు. స్పందించిన తాసిల్దార్ లక్ష్మీరాజయ్య మంగళవారం వరి కోత యంత్రాల యజమానులు, ఏజెంట్లు తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టైర్ల మిషన్ తో ఎకరానికి 2 వేల 200, బురదలో కోసే చైన్ మిషన్ కు గంటకు 3 వేల రూపాయలు తీసుకోవాలని, సుదీర్ఘంగా చర్చించిన అనంత రం ధరలు తగ్గిస్తూ అంగీకారం కుదిరినట్లు తహసీల్దార్ మీడి యాకు తెలిపారు. ఈ మేరకు తాసిల్దార్ లక్ష్మీరాజయ్య రైతు ల పక్షాన చర్చలు జరిపి ధరలు తగ్గించినందుకు, పలువురు రైతులు మండల తాసిల్దార్ కు కృతజ్ఞతలు తెలిపారు.