గద్దెల నుండి మందిరాలకు బయలుదేరిన పూజారులు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని అమ్మవార్ల గద్దెల వద్ద బుధవారం రాత్రంతా గిరిజన పూజారులు (వడ్డెలు) భక్తి శ్రద్ధలతో జాగారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సూర్యోదయానికి ముందు గద్దెల వద్ద నుండి అమ్మవార్ల మందిరాలైన బయ్యక్కపేట, కన్నెపెల్లి గ్రామాలకు కొమ్ము శబ్దాల నడుమ పయనమయ్యారు. ఈ సందర్భంగా భక్తులు వడ్డెలకు ఎదురెళ్లి పొర్లు దండాలు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల పూజారులు మందిరాలకు చేరుకొని శనివారం వరకు అంతర్గత పూజలు నిర్వహించనున్నారు.
1 thought on “గద్దెల నుండి మందిరాలకు బయలుదేరిన పూజారులు”