ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి
– ములుగు ఎస్పి శబరీష్
ములుగు ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్పీ శబరీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ములుగు డి.ఎస్.పి రవీందర్, ఇన్స్పెక్టర్లు , సబ్ ఇన్స్పెక్టర్లతో బుధవారం ఎస్పీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పోలీస్ అధికారులు ములుగు జిల్లా లోని మైనింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలిం చేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతా లలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని, ములుగు జిల్లా గోదావరి నదీ పరివాహక ప్రాంతమైనందున, ఇసుక అక్రమంగా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అక్రమంగా ఇస్సుక తవ్వే ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకస్మిక తనిఖీల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తూ , వాహ నాలను జప్తు , కేసులు నమోదు చేయాలన్నారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్య స్దానం, అలాంటి ఉల్లంఘన, అక్రమాలపై భారతీయ న్యాయ సంహిత( బీఎన్ఎస్ ), పీడీపీపీ, మైనింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేపట్టే నిర్వాహకుల పేర్లను తప్పకుండా బయటకు తీసుకువచ్చి వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్పీ శబరీష్ జిల్లా పోలీసులను ఆదేశించారు.
1 thought on “ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి”