మేడారం జాతరలో దొంగల చేతివాటం
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులను టార్గెట్ చేసుకొని దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. గురువారం అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లో నిలబడి ఉన్న వృద్ధురాలు మెడ నుండి బంగారాన్ని అపహరించిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోల్లకల్లు గ్రామానికి చెందిన సొల్తీ పుషమ్మ కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుక నుండి మెడలోని 4 తులాల పుస్తెలతాడు కత్తిరించి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పుషమ్మ దొంగను పట్టుకోగా మరొక వ్యక్తి వచ్చి బలవంతంగా విడిపించడంతో దొంగలు పారిపోయారు. అయితే అక్కడే గద్దెలపై విధులు నిర్వహిస్తున్న సిసిఎస్ క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గాలి రాజ్ కుమార్, మధులు అప్రమత్తమై దొంగను పట్టుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ కి తరలించారు. పుష్పమ్మ మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం పోలీసు ఉన్నాతాధికారుల చేతుల మీదుగా కుటుంబ సభ్యుల ముందు అందించారు. విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్, మదులను ఉన్నతాధికారులు అభినందించారు.
2 thoughts on “మేడారం జాతరలో దొంగల చేతివాటం”