మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: మండలంలోని ముప్ప నపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో బోరుగూడెంకు చెందిన సెగ్గెం కిష్టయ్య(65) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి 50కిలోల సన్నబియ్యం తో పాటు వంట సామాగ్రిని ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్య క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబా బు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాటి రాజబాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చిదరి సుమన్, జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ సాంబశివ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, మండల కో-ఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్, ముప్పనపల్లి గ్రామ అధ్యక్షుడు దాసరి నర్సింగరావు, జిల్లా బీసీ నాయకులు కటకం మల్లయ్య, ఎండి. సాయక్, మండల నాయకులు వనపర్తి రామయ్య, చింతకుట్ల వెంకట య్య, ధర్కోకోళ్ల బిక్షపతి, మంచాల సత్యం, కంచె రమేష్, స్థానికులు సెగ్గెం సుధాకర్, బొడ్డు సమ్మయ్య, ఆదినారాయణ, బత్తుల నవీన్, పెద్ది లక్ష్మీనారాయణ, సెగ్గెం నర్సింగరావు, గంప గోపాల్ తదితరులు పాల్గొన్నారు.