ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న దుద్దిళ్ళ శ్రీనుబాబు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం మండలం చిదినపల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహోదరుడు, శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాటారం మండల పరిషత్ అధ్యక్షులు సంతకాని సమ్మయ్య, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ రవీందర్ రా, మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరవెల్లి విలాస్ రావు, కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ల కిరణ్ గౌడ్, రాజు నాయక్, యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దిల్ల శ్రీను బాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రతి ఒక్కరిలో పరిడవిల్లాలని, తద్వారా గ్రామంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుందని, పాడిపంటలతో సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మాలా ధారణ భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణం లో ప్రజలతో ముచ్చటించారు.