రామ జన్మభూమి పూజిత అక్షితల పంపిణీ
ములుగు, జనవరి6, తెలంగాణ జ్యోతి : శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానం (శ్రీ క్షేత్రము) ములుగు ఆధ్వర్యంలో శనివారం ములుగు పట్టణంలో రామతీర్థ శ్రీ రామ జన్మభూమి పూజిత అక్షితల పంపిణీ కార్యక్రమము నిర్వహించారు. మొదట ఆలయ అర్చకులు పొడిచేటి శేషాచార్యులు పూజ నిర్వహించారు. పట్టణం లోని ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆ అక్షితలను పరమ పవిత్రం తో స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గండ్రకోట కుమార్, డా. సుతారి సతీష్, కొత్తపల్లి బాబురావు, తోట తిరుపతి, సిరికొండ బలరాం, తోట శ్రావణ్, గొర్రె అంకుష్, గాదం కుమార్, రామస్వామి, నైస్ రాజు, మాధవి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
1 thought on “రామ జన్మభూమి పూజిత అక్షితల పంపిణీ”