ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.
– పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తక్కలపల్లి రవీందర్రావు
తెలంగాణ జ్యోతి, ఖానాపూర్ : ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తక్కలపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి కేకును పంచిపెట్టి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రదినిధి తక్కలపల్లి రవీందరావు మాట్లాడుతూ మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. మీ నిజాయితీ కలిగిన కృషితో ప్రజలకు సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, విజయాలను సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాననీ రవీందరావు అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అరునెలలు గడిచాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత హామీలను నెరవేర్చా మన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200.యూనిట్లు వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచామని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వం మరింత బలంగా బలపరిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏల్ది శ్రీనివాస్, గ్రామ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.