ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 48వ జన్మదిన వేడుకలు కాటారం మండలంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి జోడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గారేపెల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పంతకాని సడవలి, మండల ఉపాధ్యక్షులు ఊర వెంకటేశ్వరరావు, మందల లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొండగొర్ల వెంకటస్వామి, ఉపాధ్యక్షులు గాలి సడవలి, మహిళా నాయకురాలు శ్రీ లక్ష్మీ చౌదరి, పట్టణ అధ్యక్షులు ఉప్పు సంతోష్, తైనేని సతీష్, కాటారం గ్రామ అధ్యక్షులు కొండపర్తి రమేష్, సీనియర్ నాయకులు తూటి మనోహర్, యూత్ నాయకులు అశోక్, మహిళా నాయకు రాలు మమత, నాగమణి, బయ్యారం అధ్యక్షులు మొండ య్య, సోషల్ మీడియా ఇంచార్జులు మాడెం రాజబాబు, మేడిగడ్డ దుర్గారావు, రాజబాబు, యూత్ నాయకులు పసుల శంకర్, దేవేందర్, రజినీకాంత్, మన్తుర్తి రాజకుమార్, రత్నాకర్, జాడి శ్రీశైలం, ఘంటా సమ్మయ్య, వంశీ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.