ఎండ వేడికి మజ్జిగ ఉపశమనం

On: May 26, 2026 5:47 PM

ఎండ వేడికి మజ్జిగ ఉపశమనం

ఎండ వేడికి మజ్జిగ ఉపశమనం

బాటసారులకు చల్లటి మజ్జిగ పంపిణీ

వెంకటాపురం, మే 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ సాయి పూజా సామాగ్రి షాప్ యజమాని మంగళవారం సామాజిక బాధ్యతను చాటుకుంటూ గిరిజన సంతకు వచ్చిన ప్రజలు, బాటసారుల కోసం 200 మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. రోహిణి కార్తె ఎండలు మండిపోతున్న వేళ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. భానుడి భగభగలకు అలసిపోయిన వారికి చల్లటి మజ్జిగ అందించి దాహార్తిని తీర్చారు. తీవ్ర ఎండల్లో మజ్జిగ శరీరానికి ఉపశమనాన్ని కలిగించడంతో పాటు వడదెబ్బ నుంచి రక్షణకు కూడా దోహదపడుతుందని షాప్ యజమాని తెలిపారు. సమాజం పట్ల బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్థానికులు, ప్రయాణికులు ఆయన సేవా భావాన్ని అభినందించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!