మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ అండ

On: May 13, 2026 8:52 PM

మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ అండ

మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ అండ

రూ.35 వేల ఆర్థిక సహాయం అందజేత

వెంకటాపురం, మే 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ చురుకైన కార్యకర్త బొల్లి రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బుధవారం పార్టీ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎల్లవేళలా కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ పార్టీ సీనియర్ నాయకుడు గొడవర్తి నరసింహమూర్తి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు గంపా రాంబాబు రూ.35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యకర్తల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ తరఫున ఈ సహాయం అందించినట్లు నాయకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని, మండలంలోని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా, ఉప సర్పంచ్ గార లాలయ, ముజాఫర్, శ్యామల రమేష్, నల్లూరి సుధాకర్, పీ. సమ్మయ్య, నరేష్, బొల్లి నరసింహారావు, నాగేశ్వరరావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!