ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్
– ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా మంగపేట మండలంలో పలు గ్రామాలలో ఇంటింట ప్రచారాన్ని ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారన్నారు. క్వింటా వడ్లకు 500 బోన్స్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదన్నారు. పెన్షన్లు 4 వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తాననడం హాస్యాస్పదమని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిల కంటి ముకుందం, పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్, జిల్లా నాయకులు, కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, సీనియర్ నాయకులు, ఆళ్ల జనార్దన్, కోరం నర్సింహులు, చిన్నదర్ చక్రధర్, యర్రంకాని పురుషోత్తం, తదితరులు ఉన్నారు.
1 thought on “ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ”