చెరువులతో భవిష్యత్ తరాలకు ప్రయోజనం 

Written by telangana jyothi

Published on:

చెరువులతో భవిష్యత్ తరాలకు ప్రయోజనం 

– ఈ జీ ఎస్ ఈ సీ సురేష్ 

– లక్ష్మీదేవి పేట లో ఘనంగా అమృత్ మహోత్సవ్ వేడుకలు 

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : చెరువుల అభివృద్ధితో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయోగకరమని ఉపాధి హామీ పథకం ఈసీ జనగాం సురేష్ అన్నారు. మంగళవారం అమృత్ సరోవర్ వేడుకల్లో భాగంగా మండలం లోని లక్ష్మిదేవి పేట గ్రామం కోయ కుంట వద్ద నీటి వినియోగం, రక్షణ పై విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడారు. అమృత్ సరోవర్ పథకం లో ఈనెల 12నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుం దన్నారు. ఉపాధి హామీలో భాగంగా చెరువును అభివృద్ధి చేయడంతో పాటు చెరువు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం కల్పించ నుందన్నారు. చెరువుగట్లపై నీడనిచ్చే మొక్కలను పెంచాల న్నారు. అనంతరం విద్యార్థులు నృత్యంతో అలరించారు .వారికి బహుమతులు అందించారు.కార్యక్రమం లో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు పోరిక సురేష్, కోరే కుమారస్వామి, అమరావతి విద్యాలయం ప్రధానోపాధ్యా యుడు వీరగాని రాజయ్య, ఉపాధ్యాయులు మూల రాజయ్య, కిరణ్, అఖిల, కారోబార్ గోస్కుల లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్లు కేతిరి రాధిక, నల్లబెల్లి భాస్కర్, పోలోజు రామాచారీ, రైతులు సంపత్ రెడ్డి, కేతిరి బిక్షపతి, మునిగాల రామ కృష్ణ, పాలకుర్తి జ్యోతి, చిలుక కొమురయ్య, విద్యార్థులు గాజవేన అఖిల, ఉప్పుల కావ్య, పైడిపెల్లి రమ్య, , బానోత్ ధరణి, భూక్యా అంజలి తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now