మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహణ
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 25, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాతీయ కీటక జన్య వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పరిధిలో వైద్యాధికారి డాక్టర్ ఆసీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివాసాల చుట్టూ మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు పుట్టకుండా చర్యలు తీసుకోవాలని, దోమల కాట్ల నుంచి రక్షణ పొందాలని తెలిపారు. ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. మలేరియా నిర్మూలన మన చేతుల్లోనే సాధ్యమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో హెచ్‌ఈఓ కుప్పిలి కోటిరెడ్డి, సిబ్బంది ప్రవీణ్, రాజేష్, మోహన్ కృష్ణ, భూపతి రావు, స్వాతి, ఆశా కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.









