సమయపాలన పట్టని రెవెన్యూ అధికారులు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని తహసీల్దార్ కార్యాలయం లో ప్రతిరోజు ఉదయం 11 కావస్తున్నా రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా రావడం ఏంటో.. అధికారి మేనేజ్మెంట్ లోపమా…? లేక ఇంకేమైనా వుందా…? అని పలువురు చర్చించుకుంటున్నారు. వివరా ల్లోకి వెళితే… ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల తహశీల్దార్ కార్యాలయానికి వివిధ సమస్యల పై ఆఫీస్ కు వచ్చిన ప్రజలకు కనీసం ఫ్యాన్స్, సౌకర్యం లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో పక్క తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడ లేని దుస్థితి దర్శనం ఇస్తుంది. అసలే ఎండలు అధికంగా ఉన్న తరుణంలో, అధికారులకు మాత్రం వారి వారి టేబుల్ల ముందు వాటర్ బాటిల్ దర్శన మవుతా యి. అధికారుల కోసం ప్రజలు కార్యాలయం వద్ద నిరీక్షించా ల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయని వాపోయారు. ప్రతి రోజు ఇదే విధానం కొనసాగుతుందని ప్రజలు తెలిపారు. పనుల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఇక్కడ రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకో వాలని మండల ప్రజలు కోరుతున్నారు.