క్లారిటీ లేని గ్యారెంటీ లతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
– బీఆర్ఎస్వీ యువనాయకుడు దుర్గం రాజ్ కుమార్
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : క్లారిటీ లేని ఆరు గ్యారెంటీ పథకాలను చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్వీ యువ నాయకుడు దుర్గం రాజ్ కుమార్ విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన ఆరు గ్యారంటీ లలోని 13అంశాలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వా న్ని కోరారు. మంగళవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలకేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో దుర్గం రాజ్ కుమార్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక ల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం రావాలని, ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి నెలలు గడిచాక ఆగస్టులో చేస్తానని చెప్పడం దారుణమన్నారు. ఈ ఆగస్టులో రుణమాఫీ చేస్తారా వచ్చే ఏడాది ఆగస్టులో చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం సీఎంపై ఉందన్నారు. అదేవిధంగా 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇస్తానని చెప్పి ఎందుకు అమలు చేయలేదన్నారు. వందరోజులు పూర్తయినా కూడా హామీలు అమలు కాలేద న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.