25 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న కాళేశ్వరం పోలీసులు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం గ్రావిటీ కెనాల్ వద్ద 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కాళేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. కాళేశ్వరం పోలీసులు శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా బొలోరో వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు బియ్యాన్ని, వాహనం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చెన్నూరు చెందిన రమేష్ ఎల్లక్కపేట, రాజిరెడ్డి వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ పేర్కొన్నారు. అక్రమ రవాణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాళేశ్వరం ఎస్సై హెచ్చరించారు.