అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

మంగపేట, తెలంగాణ జ్యోతి : గురువారం రాత్రి మండలం లోని రాజు పేట చెరుకు మెట్ల దారిలోనీ మోదుగు రాములు ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాములు గ్రామం లో టిఫిన్ సెంటర్ నడుపు కుంటున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో టిఫిన్ సెంటర్ లో ఉండగా చెరుకు మిట్ట లోని ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగాయని తెలిపారు. విషయం తెలుసుకున్న రాములు అక్కడికి వచ్చే లోపే ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు వంట సామాగ్రి, దుస్తులు, బీరువా, కొంత నగదు, బియ్యం కాలి బూడిదయ్యాయి . వాటి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఇళ్ల దగ్ధమై కట్టుబట్టలతో నిలిచిన పేద కుటుంబాన్ని పెద్ద మనసుతో సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment