చిన్నబోయినపల్లి డీఎన్టీ యూపీఎస్‌లో అడ్మిషన్లు ప్రారంభం
కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యం
ఏటూరునాగారం,మే23, తెలంగాణజ్యోతి:మండలంలోని చిన్నబోయిన పల్లి డీఎన్టీ యూపీఎస్ పాఠశాల నూతన విద్యా సంవత్సరానికి సన్నద్ధమై గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 7వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేపట్టనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ విద్యార్హతలు కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల తో నాణ్యమైన విద్య అందించనున్నట్లు పేర్కొంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రాంగణంలో “చదువుల పండుగ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థికి పాఠశాల తరఫున బ్యాగ్‌తో పాటు విద్యా సామగ్రి కలిగిన ఉచిత వెల్కమ్ కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై అపోహలు వీడి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని పాఠశాల యాజమాన్య కమిటీ కోరింది.









