రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు గంగూగూడెం బాలిక ఎంపిక
ఓపెన్ కేటగిరీలో ప్రతిభ చాటిన ఆదివాసీ చిన్నారి
కన్నాయిగూడెం, మే18, తెలంగాణజ్యోతి: రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల కు మారుమూల ఆదివాసీ ప్రాంతానికి చెందిన బాFile Edit View Insert Format Tools Tableలిక ఎంపికై ప్రతిభ చాటింది. మండల పరిధిలోని రాజన్నపేట పంచాయతీ గంగూగూడెం గ్రామానికి చెందిన పొడెం నందిత హకీంపేటలోని రాష్ట్ర క్రీడా పాఠశాల అడ్మిషన్ల కోసం ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీలలో ప్రతిభ కనబర్చి ఓపెన్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం నందిత ఏటూరునాగారం మండలంలోని ఆకులవారి ఘనపురం ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.









