కల్వర్టును ఢీకొట్టిన ట్రాక్టర్.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ట్రాలీ బోల్తాపడి ప్రమాదం.. చర్ల ఆస్పత్రికి తరలింపు
వెంకటాపురం, మే 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సూరవీడు కాలనీ సమీపంలో ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ కల్వర్టును ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఢీకొన్న అనంతరం వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లగా ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పవన్ తీవ్రంగా గాయపడి కాలు విరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఎదిర 108 అంబులెన్స్ ఈఎంటీ రాజ్‌కుమార్, పైలట్ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.









